రాష్ట్రంలోని అనాథ పిల్లలను దత్తత తీసుకుని వారికి మానవతా దృక్పథంతో అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్రంలోని అనాథలను దత్తత తీసుకునేందుకు ప్రభుత్వం ‘అనాథ పాలసీ’ని ప్రవేశపెడుతుందని తెలంగాణ మంత్రి కెటి రామారావు సోమవారం ప్రకటించారు. ఈ విధానం రాష్ట్రంలోని అనాథలకు సేవ చేస్తుందని, వారిని ‘రాష్ట్ర బిడ్డలుగా’ పరిగణిస్తామని తెలంగాణ మంత్రి కెటి రామారావు అన్నారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలో ఈ పథకాన్ని ప్రవేశపెడతామని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇతర పథకాల మాదిరిగానే మానవతా దృక్పథంతో పిల్లలకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని మంత్రి తెలిపారు.
Published by Bk Prasad founder and managing editor unitymedia



