మళ్ళీ పడి సంవత్సరాల తరువాత అన్నయ్య సెల్వరాఘవన్ డైరెక్టర్ గా తమ్ముడు ధనుష్ హీరో గా వస్తున్న చిత్రం ( నేనే వస్తున్న )
7జీ బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, యుగానికి ఒక్కడు, వంటి హిట్ సినిమాల డైరెక్టర్ సెల్వరాఘవన్ మరియు మ్యుగిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా కాంబినేషన్ లో వచ్చిన మ్యూజికల్ హిట్స్ మరెన్నో
సెల్వరాఘవన్ , ధనుష్ ఇద్దరు తమిళ్ డైరెక్టర్ కస్తూరి రాజా కు జన్మించారు
ధనుష్ తమిళ్ లోనే కాకుండా తెలుగు హిందీ కన్నడ మలయాళం లో కూడా తన యాక్టింగ్ తో మెప్పించి అక్కడ కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు
అలాగే హాలీవుడ్ లో కూడా 2018 లో ద ఎక్స్టాద్రినారి స్టోరీ ఆఫ్ ఫకీర్ 2022 లో ద గ్రే మెన్ వంటి చిత్రాల్లో నటించారు తన కోసం స్టోరీలు కాకుండా స్టోరీ కోసం తను ఆక్ట్ చేసే వాళ్ళలో ఒకరు ధనుష్ అందుకే తనకు భాష తో సంబంధం లేకున్నా హిందీలో ఫేమస్ డైరెక్టర్ ఆనంద్ యల్ రాయ్ హాలీవుడ్ లో కెన్ స్కొట్ , ఆంటోనీ రుస్సో జోయీ రస్సో ల సినిమాల్లో నటించారు
అయితే డైరెక్టర్ సెల్వరాఘవన్ ధనుష్ వీళ్ళ ఇద్దరి మొదటి రెండు సినిమాలు కూడా వీళ్ళ కాంబినేషన్ లో వచ్చినవే
సెల్వరాఘవన్ 1977 మార్చి 5 న చెన్నైలో జన్మించాడు. తండ్రి కస్తూరి రాజా ప్రముఖ సినీ దర్శకుడు. ఇతనికి మరో ప్రముఖ నటుడైన ధనుష్ తమ్ముడు. అంతేకాక ఇతనికి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వారిద్దరూ వైద్యులే. ఇతనికి చిన్నప్పుడే రెటీనా సంబంధిత క్యాన్సర్ వ్యాధి సోకడంతో ఒక కన్ను తొలగించాల్సి వచ్చింది. అందుకని బయటకు వచ్చేటప్పుడు ఎక్కువగా కళ్ళద్దాలతో కనిపిస్తుంటాడు. డిసెంబరు 15, 2006న ఇతని మూడు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సోనియా అగర్వాల్ ను వివాహం చేసుకున్నాడు. రెండేళ్ళ వైవాహిక జీవితం తర్వాత ఆగస్టు 9, 2009 న వీరిద్దరూ చెన్నైలోని ఓ కుటుంబ న్యాయస్థానంలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. తరువాత జూన్ 19, 2011న తమిళనాడు మాజీ అడ్వొకేట్ జనరల్ పి. ఎస్. రామన్ కూతురైన గీతాంజలిని వివాహం చేసుకున్నాడు. ఈ అమ్మాయి ఇతనితో ఒక సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేసి ఉన్నది ఈ దంపతులకు జనవరి 19, 2012 న లీలావతి అనే ఓ కూతురు కలిగింది. అక్టోబరు 7, 2013 న ఓంకార్ అనే కుమారుడు పుట్టాడు.
సెల్వరాఘవన్ తండ్రి కస్తూరి రాజా సినీ నేపథ్యం కలవాడే అయినా తన పిల్లలను బాగా చదువుకోమని ప్రోత్సహించాడు. దాంతో సెల్వ మెకానికల్ ఇంజనీరింగ్ లో బి.ఇ చేశాడు. కానీ అందులో తాను సరిపోనని భావించి వివిధ రంగాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుండేవాడు. కొద్ది రోజులకు తాను రచయితగా పనిచేయడమంటే ఇష్టమని తెలుసుకున్నాడు. 1997లో ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తాన రాసిన కథలను చేతపట్టుకుని నిర్మాతల కోసం తిరిగాడు కానీ ఎవరూ అతనికి అవకాశం ఇవ్వలేదు. దాంతో అతను ఇంటిపట్టునే ఉండిపోవాల్సి వచ్చింది. 2000 లో తన తండ్రి కస్తూరి రాజాకు కూడా అవకాశాలు సన్నగిల్లడంతో కుటుంబం ఆర్థికంగా కూడా సమస్యలు ఎదుర్కొన్నది. తమ దగ్గర మిగిలున్న సొమ్ములతో తుళ్ళువదే ఇల్లమై అనే సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. 2002 లో వచ్చిన ఈ సినిమాకు సెల్వరాఘవన్ కథ నందించాడు. ఇందులో అతని తమ్ముడు ధనుష్ హీరోగా నటించాడు. ఆరుగురు హైస్కూలు కుర్రాళ్ళ కథతో తయారైన ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ను అందించారు. ఈ సినిమాకు మొదట్లో అంతంత మాత్రమే ఆదరణ వచ్చినా టీనేజర్ల నుంచి మంచి స్పందన వచ్చి చెప్పుకోదగ్గ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలైన తర్వాత సెల్వరాఘవన్ నిజానికి ఆ సినిమాకు దర్శకత్వం వహించింది తానేనని, డిస్ట్రిబ్యూటర్లను ఆకట్టుకోవడం కోసం అప్పటికే దర్శకుడిగా పేరున్న తన తండ్రి కస్తూరి రాజా పేరు వాడుకున్నానని చెప్పాడు.
వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా, రంగస్థలనామం ధనుష్ గా సుపరిచితుడైన భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత. 2011 లో, ఇతడు నటించిన ఆడుకలామ్ చలనచిత్రంలో నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు, అదే సంవత్సరంలో అతడు పాడిన వై దిస్ కొలవెరి డి పాటతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు, ఇది యూట్యూబులో అత్యధికంగా వీక్షించిన భారతీయ పాటగా నమోదు అయ్యింది. 2014 వరకూ ఇతడు 5 ఫిల్మ్ ఫేర్ అవార్డులను గెలుచుకున్నాడు.
ఇతడు తమిళ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత అయిన కస్తూరి రాజా కుమారుడు. అతడి సోదరుడైన సెల్వరాఘవన్ ఒత్తిడితో ధనుష్ నటనలోకి అడుగుపెట్టాడు. రజినీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబరు 18, 2004లో ధనుష్ వివాహమాడాడు. వీరికి ఇద్దరు కుమారులు, 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు. ధనుష్, ఐశ్వర్యతో విడాకులు తీసుకున్నట్టు 17 జనవరి 2022న ట్విటర్లో ప్రకటించాడు.
వెంకటేష్ ప్రభు కురుతిపునల్ (1995) నుండి కల్పిత రహస్య ఆపరేషన్ నుండి ప్రేరణ పొందిన తరువాత “ధనుష్” అనే స్క్రీన్ పేరుని స్వీకరించారు. అతను 2002లో తన తండ్రి కస్తూరి రాజా దర్శకత్వం వహించిన తుళ్లువదో ఇలమై చిత్రంతో అరంగేట్రం చేసాడు, అది స్లీపర్ హిట్ అయింది. అతను 2003లో తన సోదరుడు సెల్వరాఘవన్ యొక్క మొదటి దర్శకత్వం వహించిన చిత్రం కాదల్ కొండేన్‌లో కనిపించాడు. ఈ చిత్రం ధనుష్‌ని మానసికంగా కలవరపెట్టిన యువకుడిగా చిత్రీకరించింది, వినోద్, తన స్నేహితుడి ప్రేమ కోసం తహతహలాడేవాడు, చివరికి ఆమెను స్వాధీనం చేసుకున్నాడు. విడుదలైన తర్వాత, ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది మరియు వాణిజ్యపరంగా కూడా పెద్ద విజయాన్ని సాధించింది, చివరికి తమిళ చిత్రసీమలో ధనుష్ యొక్క మొదటి ప్రధాన పురోగతిగా నిలిచింది. అతని తదుపరి చిత్రం తిరుడ తిరుడి.
ప్రాజెక్ట్ బ్లాక్ కామెడీ గ్యాంగ్‌స్టర్ చిత్రం ‘జగమే తంధిరమ్’, కార్తీక్ సుబ్బరాజ్ రచన మరియు దర్శకత్వం వహించబడింది, ఇది 18 జూన్ 2021న విడుదలైంది. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి మరియు జేమ్స్ కాస్మో కూడా నటించారు.ఇది విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అతను ఆనంద్ ఎల్. రాయ్ యొక్క ఆగస్ట్ 2021 చిత్రం అత్రంగి రేలో కూడా నటించాడు, ఇందులో అక్షయ్ కుమార్ మరియు సారా అలీ ఖాన్ కలిసి నటించారు. విజయ్ నటించిన దళపతి 67లో ధనుష్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.
2022లో, ధనుష్ మిత్రన్ జవహర్ దర్శకత్వం వహించిన తిరుచిత్రంబళంలో నటించాడు మరియు అతనితో పాటు నిత్యా మీనన్, ప్రియా భవాని శంకర్, రాశి కన్నా, భారతీరాజా, ప్రకాష్ రాజ్, మునిష్కాంత్ నటించారు. ఈ చిత్రం ఆగష్టు 18న విడుదలైంది థియేటర్లలో
అతని ప్రశంసలలో నాలుగు జాతీయ చలనచిత్ర అవార్డులు (నటుడిగా రెండు మరియు నిర్మాతగా రెండు), 14 SIIMA అవార్డులు, తొమ్మిది విజయ్ అవార్డులు, ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్, ఐదు వికటన్ అవార్డులు, ఐదు ఎడిసన్ అవార్డులు మరియు ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డు. భారతీయ ప్రముఖుల సంపాదన ఆధారంగా రూపొందించిన ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో అతను ఆరుసార్లు చేర్చబడ్డాడు.
Published by – Bk Prasad Founder & Managing Editor


















